శుక్రవారం 05 మార్చి 2021
Business - Dec 15, 2020 , 16:53:13

ఇండియా కోలుకున్న తీరు ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది: ఎస్ & పీ

ఇండియా కోలుకున్న తీరు ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది: ఎస్ & పీ

భారత ఆర్థిక వ్య‌వ‌స్థ శ‌ర‌వేగంగా కోలుకుంటున్న తీరు త‌మ‌కు ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంద‌ని చెప్పింది ఎస్ & పీ గ్లోబ‌ల్ రేటింగ్స్ సంస్థ‌. వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రంలో భార‌త వృద్ధి రేటును -9 శాతం నుంచి -7.7 శాతానికి స‌వ‌రించింది. ప్ర‌భుత్వం నుంచి పెద్ద‌గా విధాన ప‌ర‌మైన నిర్ణ‌యాలు లేక‌పోయినా ఈ రిక‌వ‌రీ సాధ్యం కావ‌డంపై ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసింది. క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టం, పెరుగుతున్న డిమాండ్ త‌మ రిక‌వ‌రీ అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేసింద‌ని ఎస్‌&పీ తెలిపింది. క‌రోనా మ‌హమ్మారితో క‌లిసి జీవించ‌డాన్ని ఇండియా నేర్చుకున్న‌ద‌ని, ప్ర‌జ‌లు మెల్ల‌గా సాధార‌ణ జీవ‌నానికి అల‌వాటు ప‌డుతున్నార‌ని ఆ సంస్థ అభిప్రాయ‌ప‌డింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో -23.9 శాతంగా ఉన్న వృద్ధి రేటు.. సెప్టెంబ‌ర్ నాటికి -7.5 శాతానికి త‌గ్గడం విశేషం. చాలా ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌లాగే ఇండియాలోనూ సేవ‌ల కంటే గూడ్స్‌కు డిమాండ్ పెర‌గ‌డం అనేది రిక‌వ‌రీకి దోహ‌దం చేసింద‌ని ఎస్‌&పీ చెప్పింది. వెకేష‌న్‌కు వెళ్ల‌కుండా, బ‌య‌ట రెస్టారెంట్ల‌లో భోజ‌నం చేయకుండా ఆదా చేసిన డ‌బ్బుల‌ను వినియోగ‌దారులు గూడ్స్ కొనుగోలు కోసం ఖ‌ర్చు చేస్తున్నార‌ని, అందుకే టూ వీల‌ర్‌, కార్ల అమ్మ‌కాలు భారీగా పెరిగిపోయాయ‌ని ఎస్‌&పీ వెల్ల‌డించింది. 

VIDEOS

logo