న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ రిటైల్‌లో విలీనానికి ఫ్యూచర్ రిటైల్ చేసుకున్న ఒప్పందంపై సుప్రీంకోర్టు గురువారం తీర్పు రిజర్వు చేసింది. రూ.24,613 కోట్ల విలువైన ఈ ఒప్పందాన్ని సవాల్ చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం ఇరుపక్షాల వాదనలను విన్న తర్వాత తీర్పు రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంతకుముందు ఈ ఒప్పందం అమలు చేసే విషయమై రిలయన్స్ రిటైల్, ఫ్యూచర్ రిటైల్ సంస్థలు ముందుకు వెళ్లొచ్చునని ఇటీవల ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. దీన్ని అమెజాన్.. సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
ఫ్యూచర్ సంస్థ రిలయన్స్ రిటైల్‌తో చేసుకున్న ఒప్పందాన్ని నిలిపివేస్తూ సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని అమెజాన్ తన పిటిషన్లో పేర్కొంది.
ఫ్యూచర్ గ్రూప్ ఆధ్వర్యంలోని రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ వ్యాపారాల కొనుగోలుకు గతేడాది ఆగస్టులో రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. అంతకుముందే 2019లో ఫ్యూచర్స్ రిటైల్ అనుబంధ ఫ్యూచర్స్ కూపన్స్ లిమిటెడ్‌లో అమెజాన్ 49 శాతం పెట్టుబడులు పెట్టింది.
ఫ్యూచర్స్ కూపన్స్‌లో ఫ్యూచర్ రిటైల్స్ వాటాలు ఉన్నాయి. ఫ్యూచర్ కూపన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మూడేండ్ల నుంచి 10 ఏండ్లలోపు ఫ్యూచర్ రిటైల్ కొనుగోలు చేసే హక్కు అమెజాన్‌కు దఖలు పడింది.
దీని ఆధారంగానే రిలయన్స్-ఫ్యూచర్ మధ్య కుదిరిన ఒప్పందం ఈ నిబంధనలను ఉల్లంఘిస్తున్నదని అమెజాన్ వాదిస్తున్నది. ఈ క్రమంలోనే అమెజాన్ సింగపూర్ మధ్యవర్తిత్వ కోర్టును ఆశ్రయించగా.. రిలయన్స్‌తో డీల్‌పై స్టే విధించింది.
తొలుత ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ కూడా అమెజాన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ఫ్యూచర్ గ్రూప్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ అనుకూలంగా తీర్పునిచ్చింది. రిలయన్స్-ఫ్యూచర్ ఒప్పందం అమలుపై ముందుకెళ్లొచ్చని పేర్కొన్నది.
Bharti Arora | ‘శ్రీకృష్ణుడి సేవ’ కోసం ఐపీఎస్‌కు రాజీనామా..
ఆ జడ్జిది యాక్సిడెంట్ కాదు హత్యే.. వీడియో
Ram charan | రూ.25 లక్షలు గెలుచుకున్న రాంచరణ్
Tokyo Olympics: మ్యాచ్‌కు ముందు ప్లేయర్‌ను లాగిపెట్టి కొట్టిన కోచ్.. షాకింగ్ వీడియో