ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Business - Feb 16, 2021 , 03:07:36

విపణిలోకి సూపర్‌సైకిల్‌

విపణిలోకి సూపర్‌సైకిల్‌

  • రోంపస్‌+ ధర రూ.31,983

ముంబై, ఫిబ్రవరి 15: ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ నెక్స్‌జు మొబిలిటీ తన ఉత్పత్తుల శ్రేణిని మరింత విస్తరించింది. ‘రోంపస్‌+’ పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్‌ బైసికిల్‌ను విపణిలో ప్రవేశపెట్టింది. ఎలక్ట్రిక్‌ స్కూటర్‌గా కూడా పనిచేసే ఈ సూపర్‌సైకిల్‌ ధరను (అన్ని యాక్సెసరీస్‌తో కలిపి) రూ.31,983గా నిర్ణయింది. 250 వాట్ల హబ్‌ బ్రష్‌లెస్‌ డీసీ (బీఎల్‌డీసీ) మోటర్‌తో నడిచే రోంపస్‌+లో 36 ఓల్ట్‌ల శక్తివంతమైన 5.2 ఏహెచ్‌ లిథియం-అయాన్‌ బ్యాటరీని అమర్చామని, దీన్ని 2.5 నుంచి 3 గంటల వ్యవధిలో పూర్తిగా చార్జింగ్‌ చేయవచ్చని కంపెనీ వివరించింది. గంటకు 25 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని అందుకోగలిగే రోంపస్‌+.. సింగిల్‌ చార్జింగ్‌తో 25 నుంచి 35 కి.మీ. దూరం వరకు ప్రయాణిస్తుందని వెల్లడించింది.

VIDEOS

logo