శనివారం 15 ఆగస్టు 2020
Business - Aug 02, 2020 , 00:37:03

ఎన్‌ఎండీసీ సీఎండీగా సుమిత్‌ దేబాన్‌

ఎన్‌ఎండీసీ సీఎండీగా సుమిత్‌ దేబాన్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రస్థానంగా ప్రభుత్వరంగ సంస్థయైన నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్‌ఎండీసీ) వ్యక్తిగత డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సుమిత్‌ దేబాన్‌... కంపెనీ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పదొన్నతి పొందారు. పదవి విరమణ చేసిన ఎన్‌ బైజేంద్ర కుమార్‌ స్థానంలో శనివారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. 2015లో కంపెనీ జనరల్‌ మేనేజర్‌గా చేరిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ.. 2019లో పర్సనల్‌ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా దేబాన్‌ మాట్లాడుతూ..సంస్థ విలువను పెంచడానికి, వృద్ధిని పరుగు పెట్టించడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు, బైజేంద్ర కుమార్‌తో పనిచేయడం గొప్ప అనుభవమన్నారు. 


logo