శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Mar 24, 2020 , 22:54:36

స్టాక్‌ మార్కెట్లకు ఉద్దీపనల జోష్‌

స్టాక్‌ మార్కెట్లకు ఉద్దీపనల జోష్‌

-సెన్సెక్స్‌ 693, నిఫ్టీ 191 పాయింట్ల లాభం

ముంబై, మార్చి 24: కరోనా వైరస్‌ భయాలతో కుప్పకూలిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఎట్టకేలకు కోలుకున్నాయి. కరోనా వైరస్‌తో ప్రభావితమవున్న రంగాలను పునరుత్తేజం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం త్వరలో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వచ్చిన వార్తలతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు తిరిగి కోలుకునేలా చేశాయి. ప్రారంభంలో వెయ్యి పాయింట్లకు పైగా లాభపడిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ తీవ్ర ఊగిసలాటల మధ్య చివరకు 692.79 పాయింట్లు లేదా 2.67 శాతం లాభపడి 26,674.03కి చేరుకున్నది. జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ 190.80 పాయింట్లు (2.51 శాతం) అందుకొని 7,801.05 వద్ద స్థిరపడింది. గత మూడు నెలలుగా సంపదను కోల్పోతున్న మదుపరుల సంపద రూ.1.82 లక్షల కోట్ల మేర పెరిగింది.  బీఎస్‌ఈలో లిైస్టెన కంపెనీల విలువ రూ.1, 82,769.92 కోట్లు పెరిగి రూ.1,03,69, 706.20 కోట్లుగా న మోదైంది. ఇన్ఫోసిస్‌ 12 శాతం పెరిగి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌యూఎల్‌, రిలయన్స్‌, మారుతి, హెచ్‌సీఎల్‌ టెక్‌, నెస్లె, ఐసీఐసీఐ బ్యాంక్‌, కొటక్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా, ఓఎన్‌జీసీ, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, టైటన్‌, ఎన్‌టీపీసీ, ఎస్బీఐ, హీరో, టాటా స్టీల్‌లు లాభపడ్డాయి. మహీంద్రా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, ఐటీసీ, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఆటోల షేర్లు తగ్గుముఖం పట్టాయి. 


logo