బుధవారం 03 జూన్ 2020
Business - Apr 17, 2020 , 15:45:19

వ‌రుస‌గా రెండో రోజు లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

వ‌రుస‌గా రెండో రోజు లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

ముంబై: వ‌రుస‌గా రెండో రోజూ దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. లాక్‌డౌన్ కొన‌సాగుతున్న‌ నేప‌థ్యంలో ఆర్బీఐ  ప‌లు నిర్ణ‌యాలు ప్ర‌క‌టించ‌డం మార్కెట్ల‌కు క‌లిసివ‌చ్చింది. ఇవాళ ట్రేడింగ్ ముగిసే స‌మ‌యానికి సెన్సెక్స్ 986.11 పాయింట్లు లాభ‌ప‌డి 31,588.72 పాయింట్ల ద‌గ్గ‌ర ముగిసింది. నిఫ్టీ 273.95 ఎగ‌బాకి 9,267 పాయింట్ల ద‌గ్గ‌ర క్లోజ‌యింది. కాగా డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ రూ.76.39గా ఉన్న‌ది. యాక్సిస్ బ్యాంక్‌, ఐసీఐసీఐ, ఇండ‌స్ఇండ్ బ్యాంక్‌, మారుతి సుజుకి, టీసీఎస్ షేర్లు లాభాల్లో ముగియ‌గా... హిందుస్తాన్ యూనిలీవ‌ర్‌, టెక్‌మ‌హీంద్రా, స‌న్‌ఫార్మా, టైటాన్ కంపెనీ షేర్లు న‌ష్టాల్లో ముగిశాయి.


logo