శుక్రవారం 05 జూన్ 2020
Business - Apr 15, 2020 , 10:44:23

భారీ లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

భారీ లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

ముంబై: దేశీయ మార్కెట్లు  భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో కీలక  సూచీలు లాభాల్లో ప‌రుగులు తీస్తున్నాయి. ప్రారంభంలోనే సెనెక్స్ 554పాయింట్లు లాభ‌ప‌డి  31,300 వద్ద కొన‌సాగుతుండ‌గా.. నిఫ్టీ 172 పాయింట్లు లాభంతో 9,166వద్ద ట్రేడ‌వుతోంది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో దాదాపు అన్నిరంగాల షేర్లు లాభ పడుతున్నాయి. హిందాల్కో, సన్ ఫార్మా,యూపీఎల్, శ్రీ సిమెంట్స్, డా.రెడ్డీస్, ఇండస్ ఇండ్, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు, టెక్ మహీంద్ర, ఏషియన్ పెయింట్స్ లాభపడుతుండ‌గా.   మారుతి  సుజుకి, జీ ఎంటర్ టైన్ మెంట్, ఓఎన్ జీసీ నష్టపోతున్నాయి. ఇక డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ రూ.75.72 వ‌ద్ద కొన‌సాగుతోంది.

 


logo