సోమవారం 01 మార్చి 2021
Business - Feb 01, 2021 , 10:50:47

బ‌డ్జెట్‌కు ముందు లాభాల్లోకి దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు

బ‌డ్జెట్‌కు ముందు లాభాల్లోకి దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు

ముంబై: కాసేప‌ట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌నున్న నేప‌థ్యంలో స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి దూసుకెళ్లాయి. గ‌త వారం మొత్తం న‌ష్టాల్లో కూరుకుపోయిన మార్కెట్లు.. సోమవారం ఉద‌యం లాభాల బాట ప‌ట్టాయి. ఆరంభ ట్రేడ్‌లో సెన్సెక్స్ 407 పాయింట్లు, నిఫ్టీ 124 పాయింట్లు లాభ‌ప‌డ్డాయి. బీఎస్ఈలో ఇండ‌స్ఇండ్ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాక్‌, టైటాన్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బ‌జాజ్ ఫైనాన్స్‌, బ‌జాజ్ ఫిన్‌స‌ర్వ్ టాప్ గెయిన‌ర్స్‌గా ఉన్నాయి. వాస్త‌వానికి బ‌డ్జెట్ రోజు స్టాక్ మార్కెట్‌లో భారీ ఊగిస‌లాట‌లు స‌హ‌జ‌మ‌ని గ‌త అనుభ‌వాలు చెబుతున్నాయి. గ‌తంలో ఎప్పుడూ చూడ‌ని బ‌డ్జెట్‌ను ఈసారి చూడ‌బోతున్నార‌ని ఆర్థిక మంత్రి నిర్మ‌ల ప్ర‌క‌ట‌న‌తో స్టాక్ మార్కెట్‌లు లాభాల బాట ప‌ట్టాయి. 

VIDEOS

తాజావార్తలు


logo