బుధవారం 03 జూన్ 2020
Business - Apr 22, 2020 , 10:20:22

స్వ‌ల్ప లాభాలాతో ప్రారంభ‌మైన స్టాక్‌మార్కెట్లు

 స్వ‌ల్ప లాభాలాతో ప్రారంభ‌మైన స్టాక్‌మార్కెట్లు

ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు  స్వల్ప లాభాలతో ప్రారంభమైనా... వెంటనే నష్టాల్లోకి జారిపోయాయి. మళ్లీ పుంజుకున్న సెన్సెక్స్ 179 పాయింట్లు ఎగిసినా మ‌ళ్లీ.. 31 పాయింట్లకు చేరి 30,667 వద్ద ఉండ‌గా..,  నిఫ్టీ 41 పాయింట్లు ఎగిసిన‌ప్ప‌ట‌కి మ‌ళ్లీ త‌గ్గి.. 8,974 వద్ద కొనసాగుతోంది. బ్యాంకింగ్ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడుతున్నాయి. ఫేస్ బుక్.. రిలయన్స్ జియోలో వాటాల కొనుగోలుతో రిలయన్స్ 7శాతం ఎగిసి టాప్ గెయినర్ గా కొన‌సాగుతుంది. కోటక్ మహీంద్ర, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకు నష్టపోతున్నాయి. జీ ఎంట‌ర్‌టైన్‌, ఎల్ అండ్ టీ, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మ, అరబిందో, ఫెడరల్ బ్యాంకు లాభపడుతున్నాయి
logo