ఆదివారం 24 జనవరి 2021
Business - Nov 27, 2020 , 12:18:03

టాప్ గెయినర్స్ లిస్టులో టాటా మోటార్స్ ,బజాజ్ ఆటో

టాప్ గెయినర్స్ లిస్టులో టాటా మోటార్స్ ,బజాజ్ ఆటో

ముంబై: గురువారం 44,260 పాయింట్ల వద్ద ముగిసిన మార్కెట్లు ఈరోజు  పడిపోయాయి. భారత ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి.18.30 పాయింట్లు అంటే 0.04శాతం  క్షీణించిన సెన్సెక్స్ 44,241.44 పాయింట్ల వద్ద, 2.10 పాయింట్లు అంటే 0.02శాతం పడిపోయిన నిఫ్టీ 12,984.90 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 753 షేర్లు లాభాల్లో, 322 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 74 షేర్లలో ఎలాంటి మార్పులేదు. దాదాపు అన్ని రంగాలు కూడా నష్టాల్లో ఉన్నాయి. సెన్సెక్స్ 147 పాయింట్లు నష్టపోయింది.

టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్ 5.04 శాతం, బజాజ్ ఆటో 3.30 శాతం, ఐచర్ మోటార్స్ 2.12 శాతం, ఏషియన్ పేయింట్స్ 1.64 శాతం, బ్రిటానియా 1.59 శాతం లాభాల్లో ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో హెచ్డిఎఫ్సీ లైఫ్ 2.06 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 1.85 శాతం, హిండాల్కో 1.61 శాతం, టీసీఎస్ 1.35 శాతం, ఎస్బీఐ1.04 శాతం నష్టాల్లో ఉన్నాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స‌లో బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, కొటక్ మహీంద్రా, రిలయన్స్, టాటా స్టీల్ ఉన్నాయి. శుక్రవారం రిలయన్స్ స్టాక్ మరింత పతనమైంది. 0.80 శాతం  రూ.15.60 క్షీణించి రూ.1,937 వద్ద ట్రేడ్ అయింది. రిలయన్స్ స్టాక్ రూ.1940 దిగువన ఉంది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.logo