శనివారం 23 జనవరి 2021
Business - Nov 10, 2020 , 12:20:32

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..!

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..!

ముంబై: నిన్నరికార్డు స్థాయి లాభాల్లోముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఈరోజు కూడా భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 228.11 పాయింట్లు  అంటే 0.54 శాతం ఎగిసి 42,825.54 వద్ద, నిఫ్టీ 62.40 పాయింట్లు అంటే 0.50శాతం పెరిగి 12,523.40 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ 458 పాయింట్లు ఎగిస 43,057 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. 718 షేర్లు లాభాల్లో, 294 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 48 షేర్లలో ఎలాంటి మార్పులేదు. దాదాపు అన్ని స్టాక్స్ కూడా లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఒత్తిడిలో ఉంది. డాలర్ మారకంతో రూపాయి 8 పైసలు బలపడి 74.06 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. క్రితం సెషన్‌లో 74.14 వద్ద ముగిసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo