గురువారం 04 మార్చి 2021
Business - Jan 07, 2021 , 12:43:38

లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు...

లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు...

ముంబై: స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ప్రారంభమయ్యాయి. మొదట సెన్సెక్స్ 250 పాయింట్ల భారీ లాభాలు చూసినప్పటికీ, ఆ వెంటనే స్వల్ప లాభాల్లోకి వచ్చింది. సెన్సెక్స్ 285.67 పాయింట్లు అంటే 0.59 శాతం ఎగిసి 48459.73 పాయింట్ల వద్ద, నిఫ్టీ 83.70 పాయింట్లు అంటే 0.59 శాతం లాభపడి 14230 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త మార్కును తాకాయి. అయితే ఆ తర్వాత సెన్సెక్స్ 70 పాయింట్ల లాభాల్లో కనిపించింది. నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో ఉంది. డాలర్ మారకంతో రూపాయి 73.11 వద్ద ప్రారంభమైంది. క్రితం సెషన్లో 73.10 వద్ద ముగిసింది. 

ఈ వీడియో చూడండి...  లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo