శనివారం 05 డిసెంబర్ 2020
Business - Oct 27, 2020 , 12:20:56

కాస్త పుంజుకున్న స్టాక్ మార్కెట్లు....

కాస్త పుంజుకున్న స్టాక్ మార్కెట్లు....

ముంబై: నిన్న నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాల్లో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 9.59 పాయింట్లు అంటే 0.02శాతం లాభపడి 40,155.09 వద్ద, నిఫ్టీ 10.90 పాయింట్లు అంటే 0.09శాతం ఎగిసి 11,778.70 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 460 షేర్లు లాభాల్లో, 503 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 51 షేర్లలో ఎలాంటి మార్పులేదు. మెటల్, పీఎస్‌యూ బ్యాంకింగ్ రంగాలు ఒత్తిడిలో ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కొనుగోళ్లు పెరిగాయి. కొటక్ మహీంద్ర బ్యాంకు షేర్లు 9 శాతం మేర లాభపడి రూ.1,550 మార్క్ సమీపానికి చేరుకున్నాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో ఏడాది ప్రాతిపదికన 26.7 శాతం లాభాలను నమోదు చేసింది. దీంతో ఈ స్టాక్స్ ఎగుస్తున్నాయి.

ఉదయం గం.10 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో కొటక్ మహీంద్ర, శ్రీ సిమెంట్స్, నెస్ట్లే, ఏషియన్ పేయింట్స్, ఎన్టీపీసీ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఐవోసీ, విప్రో ఉన్నాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో కొటక్ మహీంద్ర, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి. ప్రారంభంలో నిఫ్టీ ఎంఎంసీజీ మినహా మిగిలిన అన్ని స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టీ బ్యాంకు 0.54 శాతం, నిఫ్టీ ఆటో 0.27 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.42 శాతం, నిఫ్టీ ఐటీ 0.47 శాతం, నిఫ్టీ మీడియా 0.06 శాతం, నిఫ్టీ మెటల్ 0.94 శాతం, నిఫ్టీ ఫార్మా 0.30 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.90 శాతం, నిఫ్టీ ప్రయివేట్ బ్యాంకు 0.59 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.56 శాతం క్షీణించాయి.

ఎఫ్ఎంసీజీ మాత్రమే 0.39 శాతం లాభాల్లో ఉంది. ఐటీ స్టాక్స్‌లో టీసీఎస్ 0.61 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.63 శాతం, ఇన్ఫోసిస్ 2.31 శాతం, విప్రో 1.82 శాతం, మైండ్ ట్రీ 2.68 శాతం నష్టపోయాయి. కోఫోర్జ్, టెక్ మహీంద్ర మాత్రమే లాభాల్లో ఉన్నాయి. కోఫోర్జ్ 0.58 శాత, టెక్ మహీంద్ర 0.51 శాతం లాభపడింది. కొటక్ మహీంద్ర, ఐపీసీఏ ల్యాబ్స్, ట్రెంట్, అధానీ గ్రీన్ ఎనర్జీ, ఏసీసీ దాదాపు 5 శాతం నుంచి ఆ పైన లాభపడ్డాయి. జీఎంటర్టైన్మెంట్, నెస్ట్లే ఇండియా, కోల్గేట్ పాల్మోలివ్, ఏషియన్ పేయింట్స్, ఎంఆర్ఎఫ్, భారతీ ఇన్ఫ్రాటెల్, ఎన్టీపీసీ, టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ తదితర స్టాక్స్ 2 శాతానికి పైగా ఎగిశాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.