సోమవారం 18 జనవరి 2021
Business - Nov 27, 2020 , 19:19:03

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. ఉదయం నుండి ఒడిదుడుకుల్లోనే ఉన్నాయి. అడపాదడపా లాభాల్లోకి రావడం మినహా ఈ రోజు ఎక్కడా పుంజుకోలేదు. సెన్సెక్స్ 110.02 పాయింట్లు అంటే 0.25శాతం క్షీణించి 44,149.72 పాయింట్ల వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు అంటే 0.14శాతం తగ్గి 12,969 పాయింట్ల వద్ద ముగిసింది. 1717 షేర్లు లాభాల్లో, 1039 షేర్లు నష్టాల్లో ముగియగా, 172 షేర్లలో ఎలాంటి మార్పులేదు. ఆటో, పీఎస్‌యూ బ్యాంకింగ్ ఒక్కో శాతం చొప్పున లాభపడగా, మిగతా రంగాలు నష్టపోయాయి.

నిన్న దాదాపు 700 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఈ రోజు మరో 100 పాయింట్లకు పైగా నష్టపోయింది. టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్ 3.80 శాతం, హీరో మోటో కార్ప్ 2.79 శాతం, ఏషియన్ పేయింట్స్ 2.78 శాతం, టైటాన్ కంపెనీ 2.55 శాతం, బ్రిటానియా 2.51 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 2.66 శాతం, జె ఎస్ డబ్ల్యూ స్టీల్ 2.51 శాతం, హెచ్ సిఎల్ టెక్ 2.37 శాతం, ఓఎన్జీసీ 2.12 శాతం, హెచ్డీ ఎఫ్సీ లైఫ్ 2.12 నష్టపోయాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో కొటక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్ ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.