శుక్రవారం 15 జనవరి 2021
Business - Nov 25, 2020 , 18:10:28

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు...

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు...

ముంబై: ఇవాళ ఉదయం లాభాలతో ప్రారంభమైన ఇండియన్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. వరుస భారీ లాభాల తర్వాత బుధవారం ఒక్కసారిగా పతనమయ్యాయి. అమ్మకాలు వెల్లువెత్తడంతో ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు అంతకంతకు పడిపోయాయి. ఉదయం సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమై ఆల్ టైం గరిష్టం 44,825.03ను, నిఫ్టీ 87 పాయింట్లు ఎగిసి 13,143 పాయింట్లను తాకింది. లాభాలు ఓ గంట మాత్రమే కనిపించాయి. అమ్మకాలు వెల్లువెత్తడంతో లాభాలు క్రమంగా క్షీణించి, ఉదయం గం.10.30 సమయానికి నష్టాల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత కోలుకోలేదు.

చివరి గంటలో అమ్మకాలు జోరందుకోవడంతో సెన్సెక్స్ 44వేల దిగువకు పడిపోయింది. నిఫ్టీ కూడా 13వేల పాయింట్ల కిందకు వచ్చింది. టాప్ గెయినర్స్ జాబితాలో ఓఎన్ జీసీ 6.18 శాతం, GAIL 1.99 శాతం, అదానీ పోర్ట్స్ 1.71 శాతం, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్ 1.20 శాతం, కోల్ ఇండియా 0.57 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఐషర్ మోటార్స్ 3.65 శాతం, కొటక్ మహీంద్ర బ్యాంకు 3.24, యాక్సిస్ బ్యాంకు 3.20 శాతం, సన్ ఫార్మా 2.68 శాతం, బజాజ్ ఫైనాన్స్ 2.51 శాతం నష్టపోయాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.