బుధవారం 12 ఆగస్టు 2020
Business - Jun 26, 2020 , 23:59:11

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

సెన్సెక్స్‌ 329, నిఫ్టీ 94 పాయింట్ల వృద్ధి

ముంబై, జూన్‌ 26: స్టాక్‌ మార్కెట్‌ వరుస నష్టాలకు బ్రేక్‌పడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల పవనాలకుతోడు ఐటీ, బ్యాంకింగ్‌, ఎనర్జీ రంగ షేర్లు ఇచ్చిన దన్నుతో వారాంతం ట్రేడింగ్‌లో సూచీలు భారీగా లాభపడ్డాయి. 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ సెన్సెక్స్‌ చివరకు 329.17 పాయింట్లు లాభపడి 35,171.27కి చేరుకోగా, నిఫ్టీ 94.10 పాయింట్లు అందుకొని 10,383 వద్ద స్థిరపడింది. మొత్తంమీద ఈ వారంలో సెన్సెక్స్‌ 439.54 పాయిం ట్లు (1.26 శాతం), నిఫ్టీ 138.60 పా యింట్లు (1.35 శా తం) చొప్పున లాభపడ్డాయి. ఇన్ఫోసిస్‌ 6.94 శాతం పెరిగి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు టీసీఎస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌లు లాభపడగా..ఐటీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, కొటక్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మాలు మూడు శాతానికి పైగా కోల్పోయాయి. 


logo