గురువారం 28 మే 2020
Business - Apr 24, 2020 , 17:12:49

న‌ష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

న‌ష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు న‌ష్టాల‌తో ముగిశాయి. వ‌రుస‌గా రెండు రోజులు లాభాల్లో ఉన్న మార్కెట్లు ఈ వారం చివ‌రి రోజు లాభాల‌కు బ్రేక్ ప‌డింది. బలహీనంగా ఉన్న అంతర్జాతీయ మార్కెట్లతో పాటు, కరోనాను నియంత్రించే డ్రగ్ టెస్టులో విఫలమవడం మార్కెట్లపై నెగెటివ్ ప్రభావాన్ని చూపాయి. ఈ క్ర‌మంలోనే సెన్సెక్స్ 536 పాయింట్ల న‌ష్టంతో 31,327 ద‌గ్గ‌ర ముగియ‌గా.. నిఫ్టీ 159 పాయిట్ల లాస్ తో 9,154 పాయింట్ల‌ వ‌ద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మార‌కం విలువ రూ.76.45 ద‌గ్గ‌ర ఉన్న‌ది. కాగా ఎనర్జీ, హెల్త్ కేర్, కన్జ్యూమర్ గూడ్స్ సూచీలు మినహా మిగిలిన అన్ని సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ , సన్ ఫార్మా, హీరో మోటో కార్ప్, ఎల్ అండ్ టీ , సిప్లా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేర్లు లాభాలు చ‌విచూడ‌గా..బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ , యాక్సిస్ బ్యాంక్ , ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్, హిందాల్కో, భార‌తీ ఇన్‌ఫ్రాటెల్ షేర్లు న‌ష్ట‌పోయాయి.


logo