బుధవారం 03 జూన్ 2020
Business - Apr 03, 2020 , 16:57:38

న‌ష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

న‌ష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వ‌రుస‌గా రెండో రోజు న‌ష్టాల్లో ముగిశాయి. ప్రారంభం నుంచి ఏ మాత్రం తేరుకోని కీలక సూచీలు ట్రేడ్ చివరి గంటలో 2 శాతానికి పైగా నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 674 పాయింట్ల న‌ష్టంతో 27, 591 పాయింట్ల‌ వ‌ద్ద ముగిసింది. నిఫ్టీ 170 పాయింట్లు కోల్పోయి 8,083 ద‌గ్గ‌ర స్థిర‌ప‌డింది. డాల‌ర్‌తో పోలిస్తే రూపాయి మార‌కం విలువ రూ. 76.06 వ‌ద్ద కొన‌సాగుతుంది. స‌న్‌ఫార్మా టాప్ గెయినర్‌గా నిల్వ‌గా.. సిప్లా, ఐటీసీ, గెయిల్ ఇండియా, లూపిన్‌, భార‌త్ పెట్రోలియం, ఒఎన్జీసీ, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా, టెక్ మ‌హీంద్రా, బ‌జాజ్ ఫైనాన్స్‌, డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్స్ లాభ‌ప‌డ్డాయి. యాక్సిస్ బ్యాంక్‌, ఇండ‌స్ ఇండ్‌, ఐసీఐసీఐ,  జెఎస్‌డబ్ల్యు స్టీల్, టైటన్, హెచ్‌డిఎఫ్‌సి, కోటక్ మహీంద్రా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విప్రో, మారుతి సుజుకి,  టాటా స్టీల్  షేర్లు అత్యధికంగా నష్టపోయాయి.


logo