శుక్రవారం 05 జూన్ 2020
Business - Apr 30, 2020 , 19:33:49

భారీ లాభాల‌తో ఏప్రిల్ మాసాన్ని ముగించిన స్టాక్ మార్కెట్లు

భారీ లాభాల‌తో ఏప్రిల్ మాసాన్ని ముగించిన స్టాక్ మార్కెట్లు

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ నెలను భారీ లాభాల్లో ముగించాయి. ఆరంభం నుంచే లాభాల్లో కొన‌సాగాయి. సెన్సెక్స్ ఈ నెలలో ఏకంగా 14 శాతం పెరిగింది. గత 11 సంవత్సరాల్లో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి.  ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 997 పాయింట్లు ఎగిసి.. 33,718కి చేరుకుంది. నిఫ్టీ 307 పాయింట్లు లాభపడి 9,860 వద్ద స్థిరపడింది. అటు డాలరు మారకంలో రూపాయి బలంగాముగిసింది. నిన్న‌టి ముగింపుతో పోలిస్తే ఇవాళ రూ. 75.12 వద్ద స్థిరపడింది. మెటల్ , ఆటో, బ్యాంకింగ్ రంగ  షేర్లు లాభపడగా, ఫార్మ షేర్లలో  లాభాల స్వీకరణ కనిపించింది. టాటా మోటార్స్, యూపీఎల్,  ఓన్జీజీసీ, వేదాంతా, హిందాల్కో, హీరోమోటో కార్ప్, గెయిల్, భారీగా లాభపడ్డాయి.  సన్ ఫార్మా, హెచ్ యూ ఎల్, సిప్లా, ఇండస్ ఇండ్, ఆసియన్ పెయింట్స్, ఐటీసీ,  జీ నష్టపోయాయి. logo