బుధవారం 03 జూన్ 2020
Business - Apr 15, 2020 , 17:40:20

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: అంతర్జాతీయంగా సానుకూల పవనాలు ఉండడంతో ఈ రోజు లాభాలతో ప్రారంభమైన‌ స్టాక్‌మార్కెట్లు, బ్యాంకింగ్‌ రంగాలు ఒత్తిడికి గురవడం, ఇన్వెస్టర్‌లు ప్రాఫిట్‌ బుకింగ్‌కు మొగ్గు చూపడంతో నష్టాలతో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్‌ ముగిసే సరికి సెన్సెక్స్‌ 310 పాయిట్లు కోల్పోయి 30,379 పాయింట్ల‌కు చేరింది. కాగా నిఫ్టీ 69 పాయింట్లు కోల్పోయి 8,925 వద్ద స్థిరపడింది. కోట‌క్ మహీంద్రా, హీరోమోటో కార్ప్‌, బ‌జాజ్ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, మారుతి సుజుకి షేర్లు లాస్‌లో ఉండ‌గా...యూపీఎల్‌, హెచ్‌యూఎల్‌, బ్రిటానియా, శ్రీసిమెంట్స్‌, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు లాభ‌ప‌డ్డాయి.


logo