శనివారం 30 మే 2020
Business - Mar 27, 2020 , 17:33:24

స్టాక్ మార్కెట్లుకు ఊతమివ్వని ఆర్బీఐ మాట..

స్టాక్ మార్కెట్లుకు ఊతమివ్వని ఆర్బీఐ మాట..

ముంబయి: కరోనా ఎఫెక్ట్‌తో వరుస నష్టాలతో మునిగిపోయిన స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు కొద్దిగా లాభాలతో ముగిశాయి. సామాన్యులకు ఊరట కల్పిస్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తీసుకున్న నిర్ణయంతో, కేంద్ర ప్రకటించినప్పటికీ రూ.1.70 లక్షల కోట్ల ఉద్దీపన పథకం అండతో స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 131.18 పాయింట్లు లాభపడి 29,815.59 వద్ద ముగిసింది. నిఫ్టీ 18.80 పాయింట్లు లాభపడి 8660 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 75.27గా కొనసాగుతోంది. కోల్‌ ఇండియా, సిప్లా, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐటీసీ షేర్లు లాభపడ్డాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, హీరక్ష మోటోకార్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి. 


logo