బుధవారం 03 జూన్ 2020
Business - Apr 29, 2020 , 17:06:23

భారీ లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ప్రారంభం నుంచి మెరుగ్గా ప్ర‌భావం చూపిన కీల‌క సూచీలు  మూడో రోజు కూడా భారీ లాభాలను మూట‌గ‌ట్టుకున్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 606 పాయింట్లు పెరిగి 32,720కి చేరింది. నిఫ్టీ 172 పాయింట్లు ఎగబాకి 9,553 వద్ద స్థిర పడింది. మార్చి 13 తర్వాత మార్కెట్లు ఈ స్థాయిలో ముగియడం ఇదే ప్ర‌థ‌మం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీతో దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనే అంచనాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ముఖ్యంగా అన్ని రంగాల షేర్లు లాభాల్లో ముగిసాయి.   మెటల్,  బ్యాంకింగ్, ఆటో, పార్మ లాభాలు మార్కెట్లకు మద్దతు నిచ్చాయి. హెచ్‌డీఎప్సీ లిమిటెడ్‌, బ్యాంక్‌.. మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా, టాటాస్టీల్‌, బ్యాంక్ ఆఫ్ ఇండియా, హిందాల్కో, గెయిల్ అదానీ, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్,  హీరోమోటోకార్ప్ లాభ‌ప‌డ‌గా..యాక్సిస్ బ్యాంక్, ఏసియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనిలీవర్ , నెస్లే ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు న‌ష్ట‌పోయాయి.


logo