ఆదివారం 07 మార్చి 2021
Business - Dec 22, 2020 , 16:25:37

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

ముంబై : నిన్నటి సెషన్‌లో భారీ నష్టాలను చవిచూసిన దేశీయ మార్కెట్లు ఈరోజు కాస్త కోలుకున్నాయి. ఇవాళ ఉదయం ఊగిసలాటలో కొనసాగిప్పటికీ.. కొంత సమయం తర్వాత పుంజుకున్నాయి. ఐటీ సహా దాదాపు అన్ని రంగాల్లో కొనుగోళ్ల అండతో లాభాల్లో స్థిరపడ్డాయి. 380 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన సెన్సెక్స్‌ కాసేపటికే భారీ నష్టాల్లోకి వెళ్ళింది. ఇంట్రాడేలో 45,162 వద్ద కనిష్ఠ స్థాయిని తాకిన సూచీ ఆ తర్వాత క్రమంగా లాభాల బాట పట్టింది. కొనుగోళ్ల అండతో దూసుకెళ్లింది. మార్కెట్‌ ముగిసే సమయానికి 453 పాయింట్లు ఎగసి 46,006 వద్ద స్థిరపడింది. ఇక 13,373 వద్ద ప్రారంభమైన నిఫ్టీ ఒకదశలో 13,244 కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఆ తర్వాత చాలాసేపు స్తబ్దుగా ఉన్న సూచీ చివరకు 138 పాయింట్లు లాభపడి 13,466 వద్ద ముగిసింది.

ఇవి కూడా చదవండి...  

ఐటీఆర్‌ ఫారం 26ఏ ఎస్‌లో తప్పులా.. ఇలా సరిచేయండి!


మెర్రీ క్రిస్మస్ కు "శారీ క్రిస్మస్ ట్రీ"...! 

స్వదేశీ ఆటలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రోత్సాహం
ఈ ఆరు వెబ్ సైట్లు అస్సలు ఓపెన్ చేయొద్దు.. ఎందుకంటే...?

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి

VIDEOS

తాజావార్తలు


logo