సోషల్‌మీడియాలో చురుకుగా ఉంటూ ఫ్యాన్స్. ఫాలోవర్లలో జోష్ నింపుతుంటుంది కన్నడ భామ రష్మిక మందన్నా. ఈ బ్యూటీ తన టైం టేబుల్లో ఖచ్చితంగా జిమ్ సెషన్ ఉండేలా చూసుకుంటుంది. నాగార్జున లీడ్ రోల్ చేసిన వైల్డ్ డాగ్ త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వైల్డ్ డాగ్ పుష్ అప్ ఛాలెంజ్ లీగ్ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. తాజాగా ఈ లీగ్ ఛాలెంజ్‌లో రష్మిక పాల్గొంది.
చాలా సమయం పుష్ అప్ పొజిషన్ లో ఉన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇపుడు ఆన్లైన్ లో హల్చల్ చేస్తోంది. వైల్డ్‌డాగ్ టీంకు ఆల్ ది బెస్ట్. ఒకే జీవితం అది ఇపుడు తిరిగొస్తుంది. నేను పోస్ట్ చేసింది చూడండి..నన్ను చూడొచ్చు..నా గురించి మాట్లాడొద్దు..ఇలాంటి ఛాలెంజెస్ మరిన్ని చేయాల్సిన అవసరముంది. అంటూ క్యాప్షన్ ఇచ్చింది రష్మిక. ఇప్పటికే వైల్డ్ డాగ్ యాక్టర్ అలీ రెజాతోపాటు పలువురు ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు.