సోమవారం 30 మార్చి 2020
Business - Mar 26, 2020 , 17:03:26

కేంద్ర ఆర్థిక ప్యాకేజీ ప్ర‌క‌ట‌న‌తో దూసుకుపోయిన స్టాక్‌మార్కెట్‌

కేంద్ర ఆర్థిక ప్యాకేజీ ప్ర‌క‌ట‌న‌తో దూసుకుపోయిన స్టాక్‌మార్కెట్‌

క‌రోనా దెబ్బ‌కు క‌కావిక‌ల‌మైన స్టాక్‌మార్కెట్లు నెమ్మ‌దిగా కోలుకుంటున్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో... పేద, మధ్య తరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీని ప్రకటించడంతో ఇన్వెస్ట‌ర్ల‌లో ఉత్సాహం నిండింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు వ‌రుస‌గా మూడో రోజూ కూడా భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,410 పాయింట్లు లాభపడి 29,947కి పెరిగింది. నిఫ్టీ 323 పాయింట్లు పుంజుకుని 8,641పాయింట్ల ద‌గ్గ‌ర స్థిర‌ప‌డింది.  అటు రూపాయితో డాల‌ర్ మార‌కం విలువ 75.25 వ‌ద్ద కొన‌సాగుతుంది. ఇండస్ ఇండ్ బ్యాంక్ , ఎల్ అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్,  బజాజ్ ఆటో , భారతి ఎయిర్ టెల్, లార్సెన్‌, హీరో మోటోకార్ప్ త‌దిత‌ర షేర్లు లాభ‌ప‌డ‌గా యెస్‌బ్యాంక్‌, అదాని స్పోర్ట్స్‌, స‌న్ ఫార్మా, మారుతి సుజుకి, గెయిల్‌ మొద‌లైన షేర్లు న‌ష్టాల‌ను చ‌విచూశాయి. 


logo