శుక్రవారం 05 మార్చి 2021
Business - Jan 13, 2021 , 02:26:41

మూడోరోజూ లాభాల్లోనే

మూడోరోజూ లాభాల్లోనే

ముంబై, జనవరి 12: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. మంగళవారం లైఫ్‌టైం హైకీ చేరుకున్నాయి. దేశీయ మదుపరులు ఎగబడి కొనుగోలు చేయడం, విదేశీ నిధులు కొనసాగుతుండటంతో 30 షేర్ల ఇండెక్స్‌ మరో చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకున్నది. బ్లూచిప్‌ కంపెనీల నుంచి వచ్చిన మద్దతుతో ఇంట్రాడేలో సూచీ 49,569.14 గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు 247.79 పాయింట్లు లాభపడి 49,517.11 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ 78.70 పాయింట్లు అందుకొని 14,563.45 వద్ద స్థిరపడింది.  రెండు సూచీలకు ఇదే గరిష్ఠ స్థాయిముగింపు కావడం విశేషం. ఎస్బీఐ అత్యధికంగా 3.65 శాతం పెరిగి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. 

VIDEOS

logo