సోమవారం 01 జూన్ 2020
Business - May 13, 2020 , 18:28:43

స్టాక్‌మార్కెట్లలో ఉత్సాహం నింపిన ప్యాకేజీ..లాభాల్లో సెన్సెక్స్‌

స్టాక్‌మార్కెట్లలో ఉత్సాహం నింపిన ప్యాకేజీ..లాభాల్లో సెన్సెక్స్‌

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడంతో గత రెండు రోజులుగా నష్టాల బాటలో పయనించిన దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపన కలిగించేందుకు ప్రధాని మోదీ రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో మార్కెట్లు కళకళలాడాయి. ఒక దశలో 800 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్.. చివరకు 637 పాయింట్లు లాభపడి 32,008 కు చేరుకొన్నది. మరోవైపు జాతీయ స్టాక్‌ క్చెంజీ నిఫ్టీ కూడా 187 పాయింట్లు లాభపడి 9883 పాయింట్లకు చేరుకొన్నది. 1633 కంపెనీల షేర్ల ధరలు పెరుగగా.. 723 కంపెనీల షేర్లు పడిపోయాయి. 


logo