శనివారం 06 జూన్ 2020
Business - Apr 07, 2020 , 23:29:37

రాష్ట్రలకు ఊరట

రాష్ట్రలకు ఊరట

-ఓవర్‌డ్రాఫ్ట్‌ నిబంధనల్ని సడలించిన ఆర్బీఐ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7: ఆర్బీఐ  మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కోసం ఓవర్‌డ్రాఫ్ట్‌ ఫెసిలిటీ నిబంధనలను సడలించింది. ఈ నిర్ణ యం వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. సెప్టెంబర్‌ 30 వరకు ఈ వెసులుబాటు వర్తిస్తుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో నెలకొన్న విపత్కర పరిస్థితులు, దెబ్బతిన్న రాష్ర్టాల ఆదాయం, పెరిగిన ఖర్చుల దృష్ట్యా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నది. ఓవర్‌డ్రాఫ్ట్‌ సదుపాయం గడువునూ 14 రోజుల నుంచి 21 రోజులకు పెంచింది. త్రైమాసికంలో ఇది 50 రోజులకు మించరాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇది 36 రోజులుగానే ఉన్నది. బ్యాంక్‌తో చేసుకునే రుణ ఒప్పందమే ఈ ఓవర్‌డ్రాఫ్ట్‌ సదుపాయం. దీనివల్ల తమ ఖాతాలో ఉన్న మొత్తాల కంటే ఎక్కువ నగదును తీసుకునే వెసులుబా టు ఖాతాదారులకు వస్తుంది. అయితే అనుమతించిన మేరకే ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది.


logo