ఆదివారం 29 మార్చి 2020
Business - Feb 09, 2020 , 23:38:03

సెయిల్‌లో 5% వాటా విక్రయం!

సెయిల్‌లో 5% వాటా విక్రయం!

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ప్రభుత్వరంగ సంస్థ స్టీల్‌ అథార్టీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(సెయిల్‌)లో మరో ఐదు శాతం వాటా విక్రయించేయోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తున్నది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) రూట్‌లో విక్రయించనున్న ఈ వాటా ద్వారా కేంద్ర ఖజానాకు మరో రూ.1,000 కోట్ల నిధులు జమకానున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ వాటా విక్రయానికి సంబంధించి దీపం, స్టీల్‌ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు త్వరలో సింగపూర్‌, హాంకాంగ్‌లలో రోడ్‌షో నిర్వహించబోతున్నారు. కానీ, కరోనా వైరస్‌ నేపథ్యంలో హాంకాంగ్‌ రోడ్‌షో వాయిదాపడినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం సంస్థలో కేంద్రం 75 శాతం వాటా కలిగివున్నది. డిసెంబర్‌ 2014లో 5 శాతం వాటాను విక్రయించింది. ఓఎఫ్‌ఎస్‌ రూట్‌లో ఐదు శాతం వాటాను విక్రయించాలనుకుంటున్నాం..రోడ్‌షోలో పెట్టుబడిదారుల డిమాండ్‌ను బట్టి మరింత పెంచే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రభుత్వవర్గాలు సంకేతాలిచ్చాయి. ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం సెయిల్‌లో ఐదు శాతం వాటాను విక్రయిస్తే కేంద్రానికి రూ.1,000 కోట్ల వరకు నిధులు సమకూరవచ్చును. 


logo