ఎస్బీఐ లాభం 6,257 కోట్లు

- క్యూ3లో 4 శాతం తగ్గిన ప్రాఫిట్
- ఆదాయంలో స్వల్ప క్షీణత
ముంబై, ఫిబ్రవరి 4: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నికర లాభం తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి వచ్చిన సమీకృత లాభంలో 6.9 శాతం తగ్గి రూ.6,257.55 కోట్లుగా నమోదైంది. ఒకేసారి రూ.4,500 కోట్లకు పైగా నిధులు ప్రయోజనం కలుగడంతో 2019-20 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో భారీ వృద్ధిని నమోదు చేసుకున్నది. స్టాండ్‌లోన్ ఆధారంగా గత త్రైమాసికంలో బ్యాంక్ రూ.5,196.22 కోట్ల నికర లాభాన్ని గడించింది. సెప్టెంబర్ త్రైమాసికంలో నమోదైన రూ.4,574 కోట్లతో పోలిస్తే పెరుగగా, ఏడాది క్రితం నమోదైన రూ.5,583.36 కోట్లతో పోలిస్తే ఏడు శాతం పడిపోయింది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.76,797.91 కోట్ల నుంచి రూ.75,980.65 కోట్లకు తగ్గినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది.
- బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 6.94 శాతం నుంచి 4.77 శాతానికి తగ్గింది. విలువ పరంగా చూస్తే రూ.1,59,661.19 కోట్ల నుంచి రూ.1,17,244.23 కోట్లకు తగ్గాయి.
- నికర ఎన్పీఏ 2.65 శాతం (రూ.58,248. 61 కోట్లు) నుంచి 1.23 శాతానికి (రూ. 29,031.72 కోట్లకు) తగ్గాయి.
- మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ రూ.10,342.39 కోట్ల నిధులను వెచ్చించింది. గతేడాది ఇది రూ. 7,252.90 కోట్లు.
- నికర వడ్డీ ఆదాయం 3.75 శాతం పెరిగి రూ.27,778 కోట్లకు చేరుకున్నది. క్రెడిట్ వృద్ధి 6.73 శాతంగాను, నికర వడ్డీ మార్జిన్ 3.12 శాతంగా ఉన్నది.
- ఇతర మార్గాల ద్వారా బ్యాంక్ రూ.9,246 కోట్ల ఆదాయం సమకూరింది.
- కరోనా వైరస్ కారణంగా రూ.3 వేల కోట్ల రుణాలను పునర్వ్యవస్థీకరించింది.
- డిసెంబర్ చివరి నాటికి బ్యాంక్ క్యాపిటల్ అడిక్వెసీ రేషియో 14.50 శాతంగా ఉన్నది.
- బ్యాంక్ షేరు ధర 5.73 శాతం లాభపడి రూ.355.10 వద్ద ముగిసింది. దీంతో ఎస్బీఐ మార్కెట్ విలువ రూ.17 వేల కోట్లు పెరిగి రూ.3,16,912.96 కోట్లుగా నమోదైంది.
‘ఏడాది క్రితం ఎస్సార్ స్టీల్ రుణానికి సంబంధించిన కేసును సెటిల్ చేయడంతో ఒకేసారి రూ.4 వేల కోట్లకు పైగా నిధులు సమకూరడం, ఇతర ప్రయోజనాల ద్వారా మరో రూ.500 కోట్లు లభించడంతో లాభాల్లో భారీ వృద్ధి నమోదైంది. దీంతో గతేడాదితో నమోదైన ఫలితాలతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న టెక్స్టైల్, ఆతిథ్య, విమానయాన రంగాలకు రుణాలను తగ్గిస్తాం’
- దీనేశ్ కుమార్ ఖారా, ఎస్బీఐ చైర్మన్
తాజావార్తలు
- ఎన్ఎస్ఈలో లోపం ఊహించలేదు.. బట్ భారీ మూల్యం చెల్లించాం!
- ‘సత్యం’ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఈడీ పిటిషన్ డిస్మిస్: టెక్ మహీంద్రా
- బావిలోపడి ఇద్దరు చిన్నారులు మృతి
- స్పెక్ట్రం వేలం: తొలి రోజే రూ.77 వేల కోట్ల ఆదాయం!
- మినీ వ్యానులో ఆవు.. వీడియో వైరల్
- ‘దృశ్యం’ కథ నిజంగా జరిగిందట..జార్జి కుట్టి నిజంగానే ఉన్నాడట!
- మహబూబ్‌నగర్ జిల్లాలో హ్యాండ్ గ్రెనేడ్ కలకలం
- కింగ్ కోఠి దవాఖానను సందర్శించిన సీఎస్
- సాయి ధరమ్ తేజ్‌తో సుకుమార్ సినిమా
- పెట్రోల్, డీజిల్‌లపై పన్నులకు కోత? అందుకేనా..!