ప్రొఫెషనల్స్ కోసం ప్రామాణిక నష్టపరిహార పాలసీ

- ఐఆర్డీఏఐ కమిటీ సిఫార్సు
న్యూఢిల్లీ, జనవరి 19: బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ ఏర్పాటు చేసిన కమిటీ.. ఓ ప్రామాణిక ప్రొఫెషనల్ నష్టపరిహార పాలసీని సిఫార్సు చేసింది. బ్రోకర్లు, కార్పొరేట్ ఏజెంట్లు, వెబ్ అగ్రిగేటర్లు, ఇన్సూరెన్స్ మార్కెటింగ్ సంస్థలకు ఈ బీమా కవరేజీ వర్తిస్తుంది. క్లయింట్లకు ఇచ్చిన సేవలు, సలహాల్లో లోపాలకుగాను ఎదురయ్యే లీగల్ చర్యల ఖర్చులు, క్లయిముల నుంచి రక్షణ పొందడానికి ఈ ప్రొఫెషనల్ నష్టపరిహార పాలసీ తోడ్పడుతుంది. తప్పును సరిదిద్దుకోవడంలో భాగంగా క్లయింట్లకు నష్టపరిహారం చెల్లించడానికీ పాలసీ ఉపయోగపడుతుంది. ఈ కొత్త పాలసీతో అన్ని డ్యామేజీలు కవరేజీ అవుతాయని కమిటీ చెప్తున్నది. కాగా, ప్రీమియం ధరలు వార్షిక ప్రాతిపదికన ఉంటాయని, పూర్తి ప్రీమియం ఒకేసారి చెల్లించాలని, వాయిదాలుండవని కమిటీ స్పష్టం చేసింది. మరోవైపు వచ్చే నెల 7లోగా ఈ పాలసీపై తమ అభిప్రాయాలను తెలియజేయాలని భాగస్వాములకు ఐఆర్డీఏఐ సూచించింది. ఇప్పటికే ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణదారులకు కళ్లెం వేసేలా ఓ సరికొత్త పాలసీని కమిటీ సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
- ప్రతి 100మందికి ఒక ఇన్చార్జి
- సేవలపై సిటిజన్ ఫీడ్బ్యాక్
- నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి
- జన్నేపల్లి శివాలయంలో.. అభివృద్ధి పనులు ప్రారంభం
- వాణీదేవికి పెరుగుతున్నమద్దతు
- భ్రమరాంభికా మల్లికార్జున స్వామి కల్యాణం
- ఇంటింటికీ తిరిగి పట్టభద్రుల ఓట్లు అభ్యర్థించాలి
- Nనో.. Dడాటా.. Aఅవైలబుల్..
- సింగరేణి.. భరోసా
- మోదీకి టీకా