సోమవారం 01 మార్చి 2021
Business - Feb 11, 2021 , 00:17:18

స్పైస్‌జెట్‌ నష్టం 57 కోట్లు

స్పైస్‌జెట్‌ నష్టం 57 కోట్లు

ముంబై: స్పైస్‌జెట్‌ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌ 31తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.56.95 కోట్ల స్టాండ్‌లోన్‌ నష్టం వచ్చినట్లు తెలిపింది. ఏడాది క్రితం సంస్థ రూ.73.22 కోట్ల లాభాన్ని నమోదు చేసుకోవడం గమనార్హం. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 51 శాతం తగ్గి రూ.1,907 కోట్లకు పరిమితమైంది. కరోనాతో రద్దు అయిన విమాన సర్వీసులు ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో నడుస్తున్నాయని, వచ్చే త్రైమాసికాల్లో మళ్లీ లాభాల్లోకి వచ్చే అవకాశాలున్నాయని కంపెనీ సీఎండీ అజయ్‌ సింగ్‌ తెలిపారు. 

VIDEOS

logo