శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Dec 17, 2020 , 23:37:09

హైదరాబాద్‌-వైజాగ్‌ మధ్య స్పైస్‌జెట్‌ ఫ్లైట్‌

హైదరాబాద్‌-వైజాగ్‌ మధ్య స్పైస్‌జెట్‌ ఫ్లైట్‌

న్యూఢిల్లీ: స్పైస్‌జెట్‌ మరో 30 రూట్లకు సర్వీసులను దశలవారీగా వచ్చే వారం నుంచి ఆరంభించబోతున్నట్లు ప్రకటించింది. కరోనా కారణంగా రద్దుచేసుకున్న విమానాల్లో మళ్లీ 80 శాతం వరకు సర్వీసులను ఆరంభించుకోవచ్చన్న కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు స్పైస్‌జెట్‌ ఈ నిర్ణయం తీసుకున్నది. దీంట్లోభాగంగా వచ్చే ఆదివారం నుంచి అహ్మదాబాద్‌, పుణె, హైదరాబాద్‌ల నుంచి బీహార్‌లోని దార్‌భంగ మధ్య విమాన సర్వీసులు నడుపబోతున్నది. అలాగే కొత్తగా హైదరాబాద్‌-వైజాగ్‌, ముంబై-గోవా, కోల్‌కతా-గోవా, అహ్మదాబాద్‌-గోవా, ముంబై-కంద్లా, ముంబై-గువాహటి, గువాహటి-కోల్‌కతా, చెన్నై-షిర్డిల మధ్య సర్వీసులు రానున్నాయి.

VIDEOS

logo