సోమవారం 01 జూన్ 2020
Business - Apr 27, 2020 , 11:30:35

మ్యూచువ‌ల్ ఫండ్స్‌కు 50000 కోట్లు

మ్యూచువ‌ల్ ఫండ్స్‌కు 50000 కోట్లు

లాక్‌డౌన్‌తో దెబ్బ‌తిన్న ఆర్థిక‌వ్య‌వ‌స్థ‌కు ఆర్బీఐ రిపేర్లు మొద‌లుపెట్టింది. తాజాగా మ్యూచువ‌ల్ ఫండ్ ప‌రిశ్ర‌మ‌కు రూ.50000 కోట్ల ద్ర‌వ్య ఉద్దీప‌న ప్యాకేజీ ప్ర‌క‌టించింది. ప్ర‌ఖ్యాత ఫ్రాంక్లిన్ టెంపుల్‌ట‌న్ సంస్థ దేశంలోని ఆరు ఫండ్స్ ను గ‌త‌వారం లాక్‌చేయ‌టంతో ఏర్ప‌డిన భ‌యాల‌ను తొల‌గించేందుకు ఈ ప్యాకేజీ ఇచ్చిన‌ట్లు తెలుస్తున్న‌ది. ఈ నిధుల‌ను మ్యూచుల్ ఫండ్ సంస్థ‌ల‌కు నేరుగా ఇవ్వ‌రు. మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌ల‌కు రుణాలు ఇస్తుంటాయి. అందుకోసం బ్యాంకుల వ‌ద్ద ద్ర‌వ్యం ల‌భ్య‌త ఉండేలా ఈ నిధులను బ్యాంకులు వాడుకోవ‌చ్చు. 90 రోజుల కాలానికి ఫిక్స్‌డ్ రెపో రేటుతో అంద‌జేస్తామ‌ని ఆర్బీఐ సోమ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. 


logo