ఆదివారం 24 మే 2020
Business - Jan 24, 2020 , 00:10:00

సదరన్‌ ట్రావెల్స్‌ ‘హాలిడే బజార్‌'

సదరన్‌ ట్రావెల్స్‌ ‘హాలిడే బజార్‌'


హైదరాబాద్‌, జనవరి 23: ట్రావెల్‌ అండ్‌ టూరిజం రంగంలో అగ్రగామి సంస్థయైన సదరన్‌ ట్రావెల్స్‌..ప్రస్తుత సంవత్సరానికిగాను పర్యాటకుల కోసం ‘హాలిడే బజార్‌'ను నిర్వహించబోతున్నది. దేశ, విదేశాల్లోని పర్యాటక ప్రాంతాలు, పుణ్య క్షేత్రాలను సందర్శించాలనుకునే పర్యాటకులు ఈ హాలిడే బజార్‌లను సందర్శించి టూర్‌ ప్యాకేజీలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చునని సూచించింది. ఈ నెల 24 నుంచి 26 వరకు మూడో రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా  ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగనున్నాయి. 


హైదరాబాద్‌లోని లక్డీకాపూల్‌, కూకట్‌పల్లిలో ఉన్న సదరన్‌ ట్రావెల్స్‌  కార్యాలయాల్లో, ఈసీఎల్‌ క్రాస్‌ రోడ్డులోని హోటల్‌ స్వాగత్‌ గ్రాండ్‌లో, ఎల్‌బీనగర్‌లోని హోటల్‌ సితార గ్రాండ్‌లోలో ఈ హాలిడే బజార్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. వీటితోపాటు హన్మకొండలోని కంపెనీ కార్యాలయంలో, కరీంనగర్‌లోని వేములవాడ రోడ్డులో ఉన్న ఆఫీస్‌లో, నిజామాబాద్‌లోని హోటల్‌ కపిలలో, ఖమ్మంలోని బడ్జెట్‌ హోటల్‌లో ఏర్పాటు చేశారు. ఈ హాలిడే బజార్‌లో అంతర్జాతీయ, దేశీయ టూర్లను బుకింగ్‌ చేసుకున్నవారికోసం మెగా లక్కీ డ్రాను కూడా నిర్వహిస్తున్నారు. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన 15 మందికి దేశ, విదేశ టూర్లకు వెళ్లే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నది సంస్థ. వచ్చే నెల 15న మెగాలక్కీ డ్రా విజేతలను సంస్థ ప్రకటించనున్నది. 


logo