ఆదివారం 07 మార్చి 2021
Business - Dec 24, 2020 , 00:39:59

కరెంట్‌తో నడిచే ట్రాక్టర్‌

కరెంట్‌తో నడిచే ట్రాక్టర్‌

  • మార్కెట్లోకి విడుదల చేసిన సోనాలికా 
  •  ధర రూ.5.99 లక్షలు

ముంబై: దేశీయ మార్కెట్లోకి కరెంట్‌తో నడిచే ట్రాక్టర్లు వచ్చేశాయి. ప్రముఖ ట్రాక్టర్ల తయారీ సంస్థ సోనాలిక..దేశీయ విపణిలోకి తొలి ఫీల్డ్‌-రెడీ ఎలక్ట్రిక్‌ ట్రాక్టర్‌ ‘టైగర్‌'ను బుధవారం అందుబాటులోకి తీసుకొచ్చింది. 25.5 కిలోవాట్ల నేచురల్‌ కూలింగ్‌ కాంప్యాక్ట్‌ బ్యాటరీ కలిగిన ఈ ట్రాక్టర్‌ ధరను రూ.5.99 లక్షలుగా నిర్ణయించింది. డీజిల్‌ ట్రాక్టర్‌తో పోలిస్తే నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ-ట్రాక్టర్‌ కోసం ముందస్తు బుకింగ్‌లను సైతం సంస్థ ఆరంభించింది కూడా. గంటకు 24.93 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే ఈ ట్రాక్టర్‌ బ్యాటరీ 8 గంటల పాటు బ్యాకప్‌ ఇవ్వనున్నది. రెండు టన్నుల ట్రాలీని అవలీలగా తీసుకుపోనున్నది. కేవలం నాలుగు గంటల్లో బ్యాటరీ చార్జ్‌ కానున్నది. వ్యవసాయ ఉత్పత్తుల్లో నూతన శకం ఆరంభమైందని, దీంట్లోభాగంగా దేశీయ రైతుకు నూతన టెక్నాలజీతో ఉత్పత్తులను అందించాలనే ఉద్దేశంతో ఈ నూతన ట్రాక్టర్‌ను విడుదల చేసినట్లు కంపెనీ ఈడీ రామన్‌ మిట్టల్‌ తెలిపారు. 

VIDEOS

logo