న్యూఢిల్లీ, ఆగస్టు 19: రైతులకు అత్యాధునిక వ్యవసాయ యంత్రాలను అద్దెకు ఇవ్వడం కోసం సొనాలికా గ్రూప్ ఓ వేదికను అందుబాటులోకి తెచ్చింది. ట్రాక్టర్లతోపాటు ఇతర వ్యవసాయ సంబంధిత మెషినరీని ఈ యాప్ ద్వారా రైతులు అద్దెకు తీసుకోవచ్చని గురువారం సంస్థ ప్రకటించింది. ‘సొనాలికా అగ్రో సొల్యూషన్స్’ యాప్ రైతులను విస్తృత శ్రేణి వ్యవసాయ యంత్రాలతో అనుసంధానం చేస్తుందని ఓ ప్రకటనలో పేర్కొన్నది. రైతులు తమ వీలును, అవసరాలనుబట్టి వీటిని అద్దెకు తీసుకోవచ్చని చెప్పింది. ‘వ్యవసాయ యాంత్రీకరణను రైతులకు సులువు చేయడానికి సొనాలికా కట్టుబడి ఉన్నది. అందుకే ఈ డిజిటల్ యుగంలో మా ఈ యాప్‌ను పరిచయం చేశాం. స్మార్ట్ఫోన్ల ద్వారా రైతులు ఈ యాప్‌పై కావాల్సిన వాటిని అద్దెకు తీసుకొని, వినియోగించి వాటి పనితీరును పరిశీలించుకోవచ్చు’ అని సొనాలికా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమణ్ మిట్టల్ ఈ సందర్భంగా తెలిపారు.