న్యూఢిల్లీ: క్యాబ్స్ సర్వీస్ అగ్రిగేటర్ ఉబెర్ టెక్నాలజీస్‌లో జపాన్ కేంద్రంగా పని చేస్తున్న సాఫ్ట్ బ్యాంక్ బుధవారం సుమారు 45 మిలియన్ల వాటాలను విక్రయించిందని సమాచారం. ఉబేర్ షేర్లు 4.6 శాతం నష్టపోవడంతో 44 డాలర్ల వద్దకు చేరుకున్నది.
దీంతో సాఫ్ట్ బ్యాంక్ తన వాటాలను విక్రయించినట్లు తెలిసింది. అయితే, ఎవరు వాటాలను విక్రయించినా 30 రోజుల లాకప్ పీరియడ్ ఉంటుందని ఉబేర్ సన్నిహిత వర్గాల కథనం.
దీదీ గ్లోబల్, ఆలీబాబా షేర్లు సరిగ్గా లేకపోవడంతో పాక్షికంగా తన వాటాలను ఉపసంహరించుకుని, లాభాలు గడించడానికి ఇదే సరైన టైం అని సాఫ్ట్ బ్యాంక్ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ నెలలో దీదీ గ్లోబల్ షేర్ 37 శాతం, ఆలీబాబా షేర్ 14 శాతం విలువ కోల్పోయింది.
తాజా నిర్ణయంతో ఉబేర్‌లో సాఫ్ట్ బ్యాంక్ షేర్ 100 మిలియన్ల లోపే నని దాని సన్నిహిత వర్గాల కథనం. ఉబేర్‌లో వాటాలను ఉపసంహరించుకున్న వార్తలతో సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ షేర్ 4.1 శాతం పుంజుకున్నది.