e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home News ఫుడ్ అగ్రిగేట‌ర్ స్విగ్గీ విలువ ఎంతంటే!

ఫుడ్ అగ్రిగేట‌ర్ స్విగ్గీ విలువ ఎంతంటే!

ఫుడ్ అగ్రిగేట‌ర్ స్విగ్గీ విలువ ఎంతంటే!

న్యూఢిల్లీ: దేశీయ ఆన్‌లైన్ ఫుడ్ డెలివ‌రీ సేవ‌ల సంస్థ స్విగ్గీలోకి భారీగా పెట్టుబ‌డులు రానున్నాయి. ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ సాఫ్ట్‌బ్యాంక్‌.. స్విగ్గీ విలువ సుమారు రూ.40 వేల కోట్లు (550 కోట్ల డాలర్లు)గా నిర్ధారించింది.

స్విగ్గీలో సాఫ్ట్ బ్యాంక్ 450 మిలియ‌న్ల పెట్టుబ‌డులు పెట్ట‌నున్న‌ది. కొన్ని వారాల్లో ఇండియ‌న్ ఫుడ్ డెలివ‌రీ స్టార్ట‌ప్ సంస్థ‌లో ఈ సంస్థ పెట్టుబ‌డి పెట్ట‌డం రెండోసారి.

స్విగ్గీలో సాఫ్ట్ బ్యాంక్‌ పెట్టుబడులకు భారత నియంత్ర‌ణ సంస్థ‌ల నుంచి ఆమోదం ల‌భించాల్సి ఉందని ఓ ఆంగ్ల పత్రిక పేర్కొంది. అయితే ఈ ప‌త్రిక క‌థ‌నంపై స్విగ్గీకానీ, అటు సాఫ్ట్‌ బ్యాంక్‌ ప్రతినిధులు కానీ స్పందించలేదు.

స్విగ్గీలో ఫాల్కన్‌ ఎడ్జ్‌ క్యాపిటల్‌ ఎల్‌పి, గోల్డ్‌మన్‌ సాక్స్‌ గ్రూప్‌ ఇప్పటికే 800 మిలియన్‌ డాలర్ల విలువైన పెట్టుబుడులు పెట్ట‌డానికి ఆసక్తి చూపుతున్నాయి. వాస్తవంగా కొన్నాళ్లుగా భారత స్టార్టప్‌ల‌లోకి పెట్టుబడుల వరద వెల్లువెత్తుతున్న‌ది.

దాదాపు ఆరు స్టార్టప్‌లను కనీసం బిలియన్‌ డాలర్‌ కంటే ఎక్కువగా విలువ కట్టి పెట్టుబడులు పెట్టారు. ఇప్పటికే మరో ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటోలో యాంట్‌గ్రూప్‌ కో, టైగర్‌ గ్లోబల్‌ వంటి సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయి.

ఇవి కూడా చదవండి..

ఈనెల 30 వ‌ర‌కు గురుకుల‌సెట్‌ దర‌ఖాస్తులు
నీట్‌-2021వాయిదా

కుంభమేళాలో 5 రోజుల్లో 1700 మందికి కరోనా

చారిత్రక ప్రదేశాలు, మ్యూజియాలను మూసివేసిన ఏఎస్‌ఐ

రాజస్థాన్‌లో నేటి నుంచి వారాంతపు నైట్‌ కర్ఫ్యూ

ఢిల్లీపై కరోనా పంజా.. ఒకే బెడ్‌పై ఇద్దరు..

ఏడాదిలో మూడో టీకా అవసరం : ఫైజర్‌ సీఈఓ

తెలంగాణలో కొత్తగా 3,840 కరోనా కేసులు
కాంగ్రెస్‌ నేత రణదీప్‌ సూర్జేవాలా, కేంద్ర మాజీ మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌కు కరోనా
దేశంలో కరోనా విలయం.. 24 గంటల్లో 2లక్షలకుపైగా కేసులు.. 1,185 మంది మృతి

కరోనా సెకండ్‌ వేవ్‌ను అధిగమించడం పెద్ద సవాలే : కేంద్రమంత్రి

దేశంలోకి త్వరలో కొత్తగా 8 బ్యాంకులు

చౌక వ‌డ్డీకే బంగారం లోన్‌.. ఈ బ్యాంకుల్లోనే..!

Advertisement
ఫుడ్ అగ్రిగేట‌ర్ స్విగ్గీ విలువ ఎంతంటే!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement