సోమవారం 10 ఆగస్టు 2020
Business - Jul 08, 2020 , 16:52:52

న‌ష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

న‌ష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఐదు రోజుల వరుస ర్యాలీకి ఇవాళ‌ బ్రేక్‌ పడింది. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 345 పాయింట్లు నష్టపోయి 36,329 వద్ద, నిఫ్టీ 93 పాయింట్లు నష్టపోయి 10,705 వద్ద ముగిశాయి. ఎంఎంటీసీ, హింద్‌ కాపర్‌, సెంచురీ ప్లైబోర్డ్స్‌, స్టీల్‌ అథారిటీ, బిర్లా సాఫ్ట్‌ షేర్లు లాభాలు మూట‌గ‌ట్టుకోగా ప్రజిమ్‌ జాన్సన్‌, త్రివేణీ టర్బైన్‌, ప్రస్టీజ్‌ ఎస్టేట్‌, డిష్మన్‌ కార్బోజన్‌, శంకర బిల్డింగ్స్‌ షేర్లు నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ రంగాలు లాభాప‌డ‌గా.. దాదాపు మిగిలిన అన్ని రంగాలు నష్టపోయాయి.

ఉదయం ట్రేడింగ్ ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి మార్కెట్ల‌లో లాభాలు, న‌ష్టాల మ‌ధ్య ఊగిస‌లాడాయి. ట్రేడింగ్ చివ‌రిదాకా ఇదే ప‌రిస్థితి కొన‌సాగినా.. ఆఖ‌రి గంట‌లో మాత్రం సూచీలు భారీగా పతనమ‌య్యాయి. బ్లూచిప్‌ షేర్లలో మహీంద్రా, బజాజ్‌ ఆటో మాత్రమే జోష్ క‌న‌బరిచాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo