బడ్జెట్ 2021 : సామాజిక, మౌలిక రంగాలకు ప్రాధాన్యం

న్యూఢిల్లీ : కోవిడ్-19 వ్యాప్తితో కుదేలైన ఆర్థిక వ్యవస్ధలో ఉత్తేజం నింపేందుకు రానున్న కేంద్ర బడ్జెట్లో సామాజిక, మౌలిక రంగాలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టడం, పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా ఫిబ్రవరి 1న పార్లమెంట్లో 2021-22 కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్లో భారీ మెట్రో ప్రాజెక్టులు, లక్ష జనాభా కలిగిన పట్టణాలకు నూతన అర్బన్ వాటర్ మిషన్ వంటి ప్రాజెక్టులపై నిర్మలా సీతారామన్ ప్రకటన చేయనున్నారు. ట్రాన్స్జెండర్లు, సీనియర్ సిటిజన్లు, అణగారిన వర్గాలకు రాయితీలు, స్కాలర్షిప్ల వంటి ప్రోత్సాహకాలను బడ్జెట్లో పొందుపరుస్తారని ఎకనమిక్ టైమ్స్ కథనం పేర్కొంది.
గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి, రోడ్డు రవాణా, హైవేస్, షిప్పింగ్ వంటి మౌలిక రంగాలకు 15-25 శాతం వరకూ నిధుల కేటాయింపులను పెంచే అవకాశం ఉందని అంచనా వేసింది. మౌలిక రంగాలకు నిధులు భారీగా పెంచితే ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు మలిదశ స్వచ్ఛ భారత్ మిషన్ను కూడా ఈ బడ్జెట్లో ఆవిష్కరిస్తారని తెలిపాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల రూపురేఖలను మార్చేలా విధాన రూపకల్పన ఉంటుందని వెల్లడించాయి. మరుగుదొడ్డ నిర్మాణమే కాకుండా సెప్టేజ్ ట్యాంకులు, ట్రీట్మెంట్ ప్లాంట్లు, మురుగునీటి శుద్ధి వ్యవస్థకూ భారీగా నిధులను కేటాయిస్తారని పేర్కొన్నాయి. మలిదశ స్వచ్ఛభారత్ మిషన్ అమలుకు రాబోయే ఐదేళ్లలో ప్రభుత్వం రూ. 1.48 లక్షల కోట్లను వెచ్చిస్తుందని తెలిపాయి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంక్షేమం కోసం కేంద్ర బడ్జెట్లో పలు చర్యలను ప్రకటిస్తారని వెల్లడించాయి.
తాజావార్తలు
- చైనా వ్యాక్సిన్ను పక్కన పెట్టిన శ్రీలంక
- నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
- సోదరిని ఫాలో కావొద్దన్నందుకు చితక్కొట్టారు
- నేడు ఇండియా టాయ్ ఫేర్-2021.. ప్రారంభించనున్న మోదీ
- మహిళపై అత్యాచారం.. నిప్పంటించిన తండ్రీకుమారుడు
- ఆటబొమ్మల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం
- జమ్మూలో ఉగ్రవాదుల భారీ డంప్ స్వాధీనం
- కరీంనగర్ జిల్లాలో పార్థీ గ్యాంగ్ కలకలం
- వివాహేతర సంబంధం.. ప్రియుడితో భర్తను చంపించిన భార్య
- పెండ్లి చేసుకుందామంటూ మోసం.. మహిళ అరెస్ట్