న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: ఈ-కామర్స్ కంపెనీ స్నాప్‌డీల్ ఈఏడాది తెలంగాణ రాష్ట్రంతో సహా దేశవ్యాప్తంగా 130 డిస్ట్రిబ్యూషన్ హబ్‌లు ప్రారంభించినట్లు తెలిపింది. తాము ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో కొత్త హబ్ల్ని తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక, ఉత్తరప్రదేశ్‌లలో ఏర్పాటు చేశామని స్నాప్‌డీల్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఈ హబ్‌ల ప్రారంభంతో దేశంలో 26,000 పిన్‌కోడ్స్ ప్రాంతాలకు తాము సేవలందించగలుగుతామని కంపెనీ పేర్కొంది. తెలంగాణలోని ఖమ్మం, మహారాష్ట్రలో లాతూర్ వంటి చిన్న నగరాల్లో ఆన్లైన్ షాపింగ్‌కు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా తమ నెట్‌వర్క్‌ను విస్తరించామని స్నాప్‌డీల్ తెలిపింది. కొనుగోళ్ళకు డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో కొత్త హబ్‌లను నెలకొల్పామని కంపెనీ వివరించింది.