e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home News స్మార్ట్ ఫోన్ల సేల్స్‌లో రికార్డులు.. ఎంతంటే?!

స్మార్ట్ ఫోన్ల సేల్స్‌లో రికార్డులు.. ఎంతంటే?!

స్మార్ట్ ఫోన్ల సేల్స్‌లో రికార్డులు.. ఎంతంటే?!

న్యూఢిల్లీ: క‌రోనా వేళ అన్ని రంగాలు దెబ్బ తిన్నా అంత‌ర్జాతీయంగా మొబైల్ ఫోన్ల విక్ర‌యాలు భారీగా పెరిగాయి. 2019తో పోలిస్తే 2020లో 7.7 శాతం స్మార్ట్ ఫోన్ల విక్రయాలు ఎక్కువ‌య్యాయి. ఇంత‌కుముందు 2015లో అత్య‌ధిక మొబైల్ ఫోన్లు అమ్ముడ‌య్యాయి. గ‌తేడాది 138 కోట్ల మొబైల్ ఫోన్లు విక్ర‌యం అయ్యాయి.

ఇదే ధోర‌ణి 2022 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని భావిస్తున్న‌ట్లు స్మార్ట్ ఫోన్ల విశ్లేష‌ణ సంస్థ.. ఇంట‌ర్నేష‌న‌ల్ డేటా కార్పొరేష‌న్ (ఐడీసీ) తెలిపింది. వ‌చ్చే ఏడాదికి 3.8 శాతం ఎక్కువై 143 కోట్ల‌కు చేరుతుంద‌ని వ‌ర‌ల్డ్ వైడ్ క్వార్ట‌ర్లీ మొబైల్ ఫోన్ ట్రాక‌ర్ అనే నివేదిక‌లో పేర్కొంది.

ప్ర‌స్తుతం ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్లు (పీసీ), టాబ్లెట్లు, టీవీలు, స్మార్ట్ హోం డివైజెస్‌పై క‌స్ట‌మ‌ర్లు ఎక్కువ‌గా ఖ‌ర్చు చేస్తున్నారు. ఈ సంగ‌తిని ఐడీసీ వ‌ర‌ల్డ్ వైడ్ మొబైల్ డివైజ్ ట్రాక‌ర్స్ ప్రోగ్రామ్ వైస్ ప్రెసిడెంట్ ర్యాన్ రైథ్ వెల్ల‌డించారు.

స్మార్ట్ ఫోన్ల సేల్స్‌లో రికార్డులు.. ఎంతంటే?!

ఈ ఏడాదిలో 5జీ స్మార్ట్ ఫోన్ల విక్ర‌యాలు 130 శాతం పెరుగుతాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. చైనా ఆవ‌ల అన్ని రీజియ‌న్ల‌లో ఈ ఏడాది చివ‌రిక‌ల్లా మూడంకెల గ్రోత్ న‌మోద‌వుతుంద‌ని భావిస్తున్నారు.

5జీ స్మార్ట్ ఫోన్ల విక్ర‌య మార్కెట్ షేర్‌లో చైనా అగ్ర‌స్థానంలోనే కొన‌సాగుతుంద‌ని అంచ‌నా. చైనా నుంచి 50 శాతం, త‌ర్వాతీ స్థానంలో అమెరికా నుంచి 16 శాతం ఎగుమ‌తులు జ‌రుగుతాయ‌ని తెలుస్తున్న‌ది.

అంత‌ర్జాతీయ మార్కెట్‌లో చైనా, జ‌పాన్ మిన‌హా వెస్ట్ర‌న్ యూర‌ప్, ఆసియా-ప‌సిఫిక్ ప్రాంతంలో 5జీ ఫోన్ల వాటా 23.1 శాతం ఉంటుంద‌ని భావిస్తున్నారు. అన్ని ర‌కాల 5జీ స్మార్ట్ ఫోన్ల ధ‌ర‌లు పెరుగుతున్నాయి.

2015 నుంచి 2021 వ‌ర‌కు క్ర‌మంగా స్మార్ట్ ఫోన్ల ధ‌ర‌లు పెరుగుతున్నాయి. ఏడాదికేడాది పెరుగుతూ వ‌చ్చిన ఫోన్ల ధ‌ర‌ల్లో ఈ సంవ‌త్స‌రం రికార్డు న‌మోద‌వుతుంద‌ని అంచ‌నా. ప్ర‌స్తుతం మిడ్ రేంజ్‌, లో ఎండ్ 4జీ ఫోన్ల‌కు డిమాండ్ ఎక్కువ‌గా ఉంది.

ఇవి కూడా చ‌ద‌వండి:

రేప‌ట్నుంచి బ్యాంకుల ప‌ని వేళ‌ల్లో మార్పు

ఐటీ రూల్స్‌: ఫిర్యాదుల స్వీకరణకు సోష‌ల్ మీడియా ఏర్పాట్లు!

బంగారంపై భార‌త్‌లో మోజు త‌గ్గుతుందా..!?

చిన్న వ్యాపారుల‌కు రిలీఫ్‌.. ఎమ‌ర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ!

ఎస్బీఐ vs యాక్సిస్ vsహెచ్డీఎఫ్‌సీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇలా..

కోవిడ్ మృతుల‌ కుటుంబాల‌కు ఈఎస్ఐ బెనిఫిట్లు ఇలా!

క‌రోనా వేళ క‌స్ట‌మ‌ర్ల‌కు ఎస్బీఐ రిలీఫ్‌.. అదేంటంటే!!

మోదీ స‌ర్కార్ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాలి : స‌చిన్ పైల‌ట్

జూన్ 20 త‌ర్వాత స్పుత్నిక్ వీ టీకాల‌ తొలి బ్యాచ్ రాక‌

5జీ నెట్‌వర్క్‌కు వ్య‌తిరేకంగా కోర్టుకెక్కిన బాలీవుడ్ న‌టి

రాజ‌ద్రోహానికి పరిమితుల‌ను సెట్ చేయాల్సిందే: సుప్రీంకోర్టు

ఆర్థిక ఇబ్బందుల‌తో స‌ర్రోగేట్ తల్లులుగా అమ్మాయిలు

రెండు వేర్వేరు డోసులు తీసుకుంటే ఎలా ? వ్యాక్సిన్ మిక్సింగ్‌పై త్వ‌ర‌లో స్ట‌డీ

క‌రోనా చికిత్స: రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు అన్‌సెక్యూర్డ్ లోన్లు!

ఐసోలేషన్ కేంద్రంతో నిరుపేదలకు మేలు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
స్మార్ట్ ఫోన్ల సేల్స్‌లో రికార్డులు.. ఎంతంటే?!

ట్రెండింగ్‌

Advertisement