సోమవారం 30 మార్చి 2020
Business - Mar 15, 2020 , 23:04:49

స్వల్పంగా తగ్గిన ఇంధన ధరలు

స్వల్పంగా తగ్గిన ఇంధన ధరలు
  • పెట్రోల్‌పై 12, డీజిల్‌పై 14 పైసలు

న్యూఢిల్లీ, మార్చి 15: అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీగా తగ్గుతున్నప్పటికీ ఇంధన విక్రయ సంస్థలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను స్వల్పంగా తగ్గించి చేతులుదులుపుకుంటున్నాయి. ఆదివారం తాజాగా లీటర్‌ పెట్రోల్‌ ధరను 12 పైసల వరకు కోత విధించిన సంస్థలు..డీజిల్‌పై 14 పైసలు తగ్గించాయి. దీంతో ఢిల్లీలో పెట్రోల్‌ రూ.69.75కి, డీజిల్‌ రూ.62.44కి చేరుకున్నట్లు ప్రభుత్వరంగ ఇంధన విక్రయ దిగ్గజం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే ఢిల్లీలోనే సుంకాలు తక్కువగా ఉండటంతో ఇక్కడ తక్కువ ధరకే ఇంధనాలు లభిస్తున్నాయి. గతవారంలో బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధరలు 30 శాతానికి పైగా తగ్గడంతో ఈ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదలాయించకుండా కేంద్రం దొంగచాటున ఎక్సైజ్‌ సుంకం రూపంలో వడ్డించింది. 2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు పెట్రోల్‌పై రూ.9.48, డీజిల్‌పై రూ.3.56గా ఉన్న ఎక్సైజ్‌ సుంకం ప్రస్తుతం పెట్రోల్‌పై రూ.22.98కి, డీజిల్‌పై రూ.18.83కి పెంచారు.  నవంబర్‌ 2014 నుంచి జనవరి 2016 లోపు ఏకంగా తొమ్మిది సార్లు వడ్డించారు. దీంతో కేంద్రానికి అదనంగా రూ.2.42 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది.logo