శుక్రవారం 03 జూలై 2020
Business - Jun 01, 2020 , 20:03:58

స్వల్పంగా తగ్గిన ఐసీఐసీఐ వడ్డీరేట్లు

స్వల్పంగా తగ్గిన ఐసీఐసీఐ వడ్డీరేట్లు

న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంకు అన్ని కాలపరిమితులతో కూడిన రుణాలపై వడ్డీ రేట్లను 0.05 శాతం కుదించింది. కొత్త వడ్డీ రేట్లు సోమవారం నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది. దీంతో ఇండ్ల తనఖా, వాహన తదితర రుణాలు ఇకపై 7.70 శాతం వార్షిక వడ్డీకే లభిస్తాయని ప్రకటించింది. 6 నెలల వ్యవధి కలిగిన రుణాలపై 7.65 శాతం, 3 నెలల కాలపరిమితి కలిగిన రుణాలపై 7.50 శాతం, నెల రోజుల వ్యవధి కలిగిన రుణాలపై 7.45 శాతం చొప్పున వడ్డీ వసూలు చేయనున్నట్టు ఐసీఐసీఐ బ్యాంకు పేర్కొన్నది. 


logo