హైదరాబాద్, అక్టోబర్ 20: ఆఫీస్ స్పేస్ ప్రొవైడర్ స్కూటర్.. హైదరాబాద్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. భాగ్యనగరంలో 3.25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన మూడు ఆఫీస్‌లను లీజుకు తీసుకున్నది. వీటిలో హైటెక్ సిటీలో ట్రాపికల్ ఫారెస్ట్ థిమ్‌తో ఆఫీస్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఆఫీస్‌లో 150 రకాల 8 వేల చెట్లు నాటింది. ఆఫీస్ చుట్టూ చెట్లు ఉండటం వల్ల ఉద్యోగుల్లో మరింత ఉత్పాదకత, నైపుణ్యం పెరిగే అవకాశం ఉంటుందని కంపెనీ కంట్రీ హెడ్ రజత్ జోహర్ తెలిపారు. గత కొన్నేండ్లుగా హైదరాబాద్‌లో ఆఫీస్‌కు డిమాండ్ నెలకొన్నదని, ముఖ్యంగా ఐటీ, అనుబంధ రంగాలకు చెందిన సంస్థలు ఇక్కడ కార్పొరేట్ ఆఫీసులను ఏర్పాటు చేయ డం ఇందుకు దోహదం చేస్తున్నదన్నారు. ఆర్ఎంజెడ్ ఫ్యూచర్, డల్లాస్ సెంటర్, మై హోమ్ ట్విట్జాలలో మూడు ఆఫీస్‌లను లీజుకు తీసుకున్నది. 2016లో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పటి వరకు ఢిల్లీ, గురుగ్రామ్, హైదరాబాద్, జైపూర్లలో ఉన్న తొమ్మిది కార్యాలయాలను 5.37 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసింది.