ఆన్లైన్లో సిప్

ప్రణాళికా బద్ధంగా దీర్ఘకాలం పాటు పెట్టుబడులు కొనసాగించాలనుకునేవారికి క్రమానుగత పెట్టుబడి విధానం (సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ఉత్తమ మార్గం. దీనినే ‘సిప్' అనే పొట్టి పేరుతో పిలుస్తారు. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల నుంచి ఇది ఎంతో ఆదరణ పొందుతున్నది. అందుకే మార్కెట్లలో క్రమానుగతంగా పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఇది అత్యుత్తమ మార్గంగా నిలిచింది. సిప్ కింద మదుపరులు ఎంచుకున్న మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టేందుకు ప్రతి నెలా వారి పొదుపు ఖాతా నుంచి నిర్దేశిత మొత్తాన్ని మినహాయిస్తారు. పెద్ద పెట్టుబడికి అవసరమైనంత సొమ్ము లేనివారికి ఈ మార్గం ఎంతో సౌకర్యవతంగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో పథకాలు కేవలం రూ.500తో సిప్‌ను మొదలు పెట్టేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. దీన్ని ఆన్‌లైన్‌లోనూ ప్రారంభించేందుకు వీలున్నది.
ఎలా ప్రారంభించాలంటే..
ఆన్లైన్లో సిప్‌ను ప్రారంభిం చేందుకు పాన్ కార్డు, చిరునామా ధ్రువీకరణ, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, చెక్ బుక్ అవసరమవుతాయి.
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడికి కేవైసీ (నో యువర్ కస్టమర్) వివరాలను తెలియజేయడం తప్పనిసరి.
కేవైసీ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫండ్ మ్యూచువల్ ఫండ్ సంస్థ వెబ్‌సైట్‌ను సందర్శించి నచ్చిన సిప్‌ను ఎంచుకోవాలి.
కొత్త అకౌంట్‌ను రిజిస్టర్ చేసుకునేందుకు ‘రిజిస్టర్ నౌ’ అనే లింక్‌ను ఓపెన్ చేయాలి.
అక్కడ కనిపించే దరఖాస్తులో వ్యక్తిగత వివరాలు, కాంటాక్ట్ సమచారం పొందుపర్చి ఫామ్‌ను సబ్మిట్ చేయాలి.
ఆన్లైన్లో లావాదేవీలు జరిపేందుకు యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌ను ఎంచుకోవాలి.
సిప్ చెల్లింపులను మినహాయించాల్సిన బ్యాంకు ఖాతా వివరాలను పొందుపర్చాలి.
యూజర్‌నేమ్‌తో లాగిన్ అయి.. పెట్టుబడి పెట్టదల్చుకున్న పథకాన్ని ఎంపిక చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసి, ఆ మ్యూచువల్ ఫండ్ సంస్థ నుంచి మీకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీరు పెట్టుబడి ప్రారంభించేందుకు వీలవుతుంది. సాధారణంగా 35 నుంచి 40 రోజుల విరామం తర్వాత సిప్ ప్రారంభమవుతుంది.
తాజావార్తలు
- ప్రదీప్ హీరోయిన్ క్యూట్ పిక్స్ వైరల్
- దేశంలో కొత్తగా 18,711 పాజిటివ్ కేసులు
- హుజురాబాద్ శివారులో ప్రమాదం : ఒకరు మృతి
- మహేష్ బర్త్ డే రోజు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న మేకర్స్
- శర్వానంద్‌కు మెగాస్టార్, కేటీఆర్ సపోర్ట్..!
- తాజ్ మహల్ సాక్షిగా వివాహ వార్షికోత్సవం..
- భయపెడుతున్న భానుడి భగభగలు
- అమరచింత మాజీ ఎమ్మెల్యే మృతి
- కబడ్డీ కోర్టులో కొండెంగ.. నేను ఆడుతా!
- మరోసారి బుల్లితెరపై సందడికి సిద్ధమైన రానా..!