ఆదివారం 29 మార్చి 2020
Business - Jan 29, 2020 , 23:36:11

వెయ్యి తగ్గిన వెండి

వెయ్యి తగ్గిన వెండి


న్యూఢిల్లీ, జనవరి 29: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన అతి విలువైన లోహాల ధరలు క్రమంగా శాంతిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా డిమాండ్‌ పడిపోవడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి కోలుకోవడంతో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.182 తగ్గి రూ. 41,019కి పడిపోయింది. మంగళవారం ఈ ధర రూ.41,201గా ఉన్నది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు  నిలిచిపోవడంతో వెండి ఏకంగా రూ.1,083 తగ్గి రూ.46,610 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ ధర 1,568 డాలర్ల, వెండి 17.47 డాలర్ల వద్ద నిలిచింది. 


logo