శనివారం 30 మే 2020
Business - May 04, 2020 , 10:20:09

రిల‌య‌న్స్ జియోలో సిల్వ‌ర్ లేక్ రూ.5656 కోట్ల పెట్టుబడులు

రిల‌య‌న్స్ జియోలో సిల్వ‌ర్ లేక్ రూ.5656 కోట్ల పెట్టుబడులు

హైద‌రాబాద్‌: ప్ర‌ఖ్యాత టెక్ కంపెనీ సిల్వ‌ర్ లేక్‌.. రిల‌య‌న్స్ జియోలో భారీ పెట్టుబ‌డులు పెట్టింది. ఆ సంస్థ సుమారు 5656 కోట్ల పెట్టుబుడ‌లు పెట్టేందుకు అంగీక‌రించింది. రిల‌య‌న్స్‌లో 1.15 శాతం షేర్ల‌ను సిల్వ‌ర్ లేక్ కొన‌గోలు చేయ‌నున్న‌ది. ఇటీవ‌లే ఫేస్‌బుక్ కూడా సుమారు 5.7 బిలియ‌న్ల డాల‌ర్లు పెట్టి జియోలో 9.99 వాటాను కొనుగోలు చేసిన విష‌యం తెలిసిందే. రిల‌య‌న్స్‌కు చెందిన జియో సుమారు 388 మిలియ‌న్ల క‌స్ట‌మ‌ర్ల‌కు డిజిట‌ల్‌ సేవ‌లు అందిస్తున్న‌ది. టెక్నాల‌జీ, ఫైనాన్స్ రంగాల్లో సిల్వ‌ర్ లేక్‌కు ప్ర‌త్యేక స్థానం ఉన్న‌ది. అతి త‌క్కువ ధ‌ర‌లో దేశ ప్ర‌జ‌ల‌కు జియో సేవ‌లు అందిస్తున్న‌ట్లు సిల్వ‌ర్ లేక్ సీఈవో ఎగ‌న్ డ‌ర్బ‌న్ తెలిపారు. ఈ ఒప్పందంలో మోర్గ‌న్ స్టాన్లీ .. ఫైనాన్షియ‌ల్ అడ్వైజ‌ర్‌గా నిలిచింది.logo