శనివారం 30 మే 2020
Business - May 02, 2020 , 00:55:05

వాహన సంస్థలకు షాక్‌

వాహన సంస్థలకు షాక్‌

  • ఏప్రిల్‌లో అమ్ముడుపోని వాహనాలు 
  • లాక్‌డౌన్‌తో షోరూంలకు తాళం

న్యూఢిల్లీ, మే 1: దేశీయ ఆటోమొబైల్‌ రంగంలో భారీ కుదుపు. కరోనా వైరస్‌ దెబ్బకు ఆటోమొబైల్‌ రంగ సంస్థల వ్యాపారం పూర్తిగా తూడిచిపెట్టుకుపోయాయి.  ఏప్రిల్‌ నెలలో ఒక్కటంటే ఒక్క కారు కూడా అమ్ముడవలేదు. ఈ ఏడాదిలో అమ్మకాలు భారీగా పెంచుకోవాలని చూసిన వాహన విక్రయ దిగ్గజాలకు కరోనా వైరస్‌ రూపంలో ఎదురుదెబ్బలు తగిలాయి. కార్ల తయారీలో అగ్రగామి సంస్థలైన మారుతి సుజుకీ, మహాంద్రా, హ్యుందాయ్‌, టయోటా కిర్లోస్కర్‌, ఎంజీలు ఒక్క వాహనాన్ని విక్రయించలేకపోయాయి. అయినప్పటికీ 632 వాహనాలను మా త్రం మారుతి ముంద్రా రేవు నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. మరో సంస్థ హ్యుందాయ్‌ కూడా 1,341 యూనిట్లను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది.  కానీ, ప్రీమి యం బైకుల తయారీ సంస్థ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మాత్రం 91 వాహనాలను విక్రయించినట్లు ప్రకటించింది. 


logo